కొండేపిలో ఒకే వేదికపై జనసేన – టీడీపీ నాయకులు

కొండేపి, నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం, జనసేన 6 మండలాల నాయకుల పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కొండేపి నియోజకవర్గ శాసనసభ్యులు డోల బాలవీరాంజనేయ స్వామి, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి దామచర్ల సత్య, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ, రాష్ట్ర కార్యదర్శి మరియు కొండేపి పరిశీలకులు అడకా స్వాములు మరియు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ ఆదేశాల మేరకు మిత్రపక్షం పార్టీ అయిన కొండేపి నియోజకవర్గ ఆరు మండలాల జనసేన మండల పార్టీ అధ్యక్షులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా కొండేపి తెలుగుదేశం పార్టీ ఆరు మండలాల అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు క్లస్టర్ ఇన్చార్జిలు యూనిట్ ఇన్చార్జులు, మాజీ ఎంపీటీసీ, జడ్పిటిసి ముఖ్య నాయకులు, బూత్ ఇన్చార్జులు మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. రెండు పార్టీల కలయిక కొండపి నియోజకవర్గంలో నూతన ఉత్సాహం ఏర్పడింది. జనసేన మరియు టిడిపి కచ్చితంగా కొండపి నియోజకవర్గంలో విజయం సాధిస్తుంది అని ప్రజలందరూ కోరుకుంటున్నారని, ఆశ భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కి మరియు కొండేపి నియోజకవర్గానికి మంచి రోజులు రాబోతున్నాయి అని ప్రజలందరూ కోరుకుంటున్నారు.