నేడు పార్టీ ముఖ్యనేతలతో జనసేనాని టెలీకాన్ఫరెన్స్

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈరోజు రాజధాని తరలింపు అంశంపై పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై అభిప్రాయాలను అడిగి తెలుసుకోనున్నారు. రాజధాని తరలింపు కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి అన్ని రాజకీయ పక్షాలకు హైకోర్టు అవకాశం ఇవ్వడంతో పార్టీ నేతల మనోగతం ఏంటో పవన్ తెలుసుకోనున్నారు.