సావిత్రి బాయి పూలే జయంతి ఘనంగా జరిపిన జనసేన-తెలుగుదేశం నాయకులు

డా. బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మామిడికుదురు మండలం, మామిడికుదురు గ్రామంలో హైస్కూల్ దగ్గర గల బాలుర వసతి గృహ ప్రాంగణంలో భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి, ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నతవ్యక్తి, కులమత బేధాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి, ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం చేచిన శ్రీ సావిత్రి బాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మామిడికుదురు మండలం ఉపాధ్యక్షులు దొడ్డ జయరామ్, మామిడికుదురు గ్రామ శాఖ ఇంటి మహేంద్ర, మండల కార్యదర్శి కాట్రేనిపాడు నాగేంద్ర, సీనియర్ నాయకులు మట్టా సత్తిబాబు, ఈలి రాంబాబు, కటకంశెట్టి కృష్ణ, కోలా సురేష్ సర్కిల్, రాజా అబ్బాస్, యువ నాయకుడు నైనాల శ్రీరామ్, టిడిపి సీనియర్ నాయకులు ఈలి శ్రీను, ఇంటి గణపతి, ఈదరాడ గ్రామశాఖ అధ్యక్షుడు బొంతు సుధాకర్, ఎరుబండి చిన్ని, గెద్దాడ గ్రామశాఖ అధ్యక్షుడు చెడు చిన్న రాజా గెద్దాడ వార్డ్ మెంబర్ వినుకొండ త్రినాథ్ త్రినాథ్, నేదునూరు రామారావు తదితరులు పాల్గొన్నారు.