జనసేన-తెలుగుదేశం నెల్లూరు సిటీ ఆత్మీయ సమావేశం
నెల్లూరు, పి.ఎస్.ఆర్ కళ్యాణ మండపం, నెల్లూరు నందు జనసేన నెల్లూరు సిటీ నిర్దేశకులు అజయ్ ఆద్వర్యంలో మాజీ మంత్రి జనసేన-తెలుగుదేశం-బిజెపి ఉమ్మడి సిటీ అభ్యర్థి పొంగూరి నారాయణ, రాజ్యసభ సభ్యులు, ఎంపీ అభ్యర్ది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, వారి సతీమణి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్ది ప్రశాంతికి మద్దతు తెలుపుతూ సిటీ ఆత్మీయ సమావేశము నిర్వహించడం జరిగింది. నెల్లూరు సిటీలో జనసేన పార్టీ మనది అంటూ కష్టపడిన జనసేన నాయకులకి, వీర మహిళలకు, జనసైనికులకు నెల్లూరు సిటీ తరఫున పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులని పరిచయం చేస్తూ వాళ్ళ గెలుపుకు మనం ఏవిధంగా కృషి చేయాలని ఉద్దేశంతో మన వేములపాటి అజయ్ ఈరోజు సభను నిర్వహించడం జరిగింది. ఈరోజున నెల్లూరు సిటీలో జనసేన పార్టీ మనది అంటూ కష్టపడిన జనసేన నాయకులకి, వీర మహిళలకు, జనసైనికులకు సిటీ తరఫున పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులని పరిచయం చేస్తూ వాళ్ళ గెలుపుకు మనం ఏవిధంగా కృషి చేయాలని ఉద్దేశంతో వేములపాటి అజయ్ ఈ సభను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-17-at-12.10.46-1024x683.jpeg)