జనసేన తీర్ధం పుచ్చుకున్న పాములపర్రు ఎంపిటిసి

భీమవరం, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రశ్నించే స్థాయి నుంచి పాలించే స్థాయికి జనసేన పార్టీ ముందుకి వెళ్తుందని దానికి నిదర్శనమే ఇతర పార్టీల నాయకులు జనసేనలో చేరడమేనని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు అన్నారు. ఆదివారం ఉండి నియోజవర్గం పాములపర్రు నుంచి ఈ మధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో పాములపర్రు గ్రామం నుంచి ఇండిపెండెంట్ ఎంపిటిసిగా గెలిచి జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన ఎంపిటిసి శ్రీ యడవల్లి వెంకటేశ్వరరావు పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు సమక్షంలో భీమవరం పార్టీ కార్యలయంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆయన వెంట సుమారు 30 మంది పార్టీలో చేరారు.