సంస్కృతులను కాపాడే సమాజం జనసేన సిద్ధాంతం: వాసగిరి మణికంఠ

  • గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ

గుంతకల్ నియోజకవర్గం: గుత్తి మండలం, జక్కల్ చెరువు గ్రామపంచాయతీ నందు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనసేన పార్టీ ఆధ్వర్యంలో గుత్తి మండల, పట్టణ అధ్యక్షులు చిన్న వెంకటేశులు, పాటిల్ సురేష్ అధ్యక్షతన నియోజకవర్గ సమన్వయకర్త వాసగిరి మణికంఠ ముఖ్య అతిథిగా, వీరమహిళల సహకారంతో “మన ఊరు – మన ఆట” అంటూ రంగ వల్లులు, పిండివంటలతో మహిళలకు ప్రత్యేక పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ జనసేన పార్టీ మూల సిద్ధాంతాల్లో ఒకటైన సంస్కృతులను కాపాడే సమాజం. అనే స్ఫూర్తితో విభిన్న సంస్కృతులకు నిలయమైన మన దేశం, మన రాష్ట్రం. అటువంటి మన రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు తరతరాలుగా తెలుగు వారి జీవితాల్లో పరిమళాలు వెదజల్లుతూనే ఉన్నాయి. ఆ సంబరాలను పెట్టింపు ఉత్సాహంతో ముందుకు తీసుకువెళ్లాలి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు వీర మహిళలతో ప్రత్యేకమైన రంగవల్లుల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు నాగయ్య రాయల్, గాజుల రాఘవేంద్ర కాపు సంక్షేమ సేన నాయకులు బుర్ర అఖిల్ రాయల్, కసాపురం నంద నిస్వార్థ జనసైనికులు దుర్గాప్రసాద్, మహేష్, రంగనాయకులు, సోము, గురు ప్రసాద్, కత్తులుగేరు అంజి, అమర్, మంజునాథ్, అనిల్ కుమార్ మరియు టిడిపి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.