సమస్యలతో సతమతమవుతున్న రైతులు మరియు ప్రజలు

  • 18వ రోజు పల్లెపల్లెకు జనసేన కార్యక్రమాన్ని
  • గజపతి నగరం మండలం, గంగచోళ్ళ పెంట గ్రామంలో పల్లె పల్లెకు జనసేన
  • జనసేన పార్టీ సీనియర్ నాయకులు మర్రాపు సురేష్

విజయనగరం జిల్లా, గజపతినగరం నియోజకవర్గం, గంగచోళ్ళ పెంట, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మర్రాపు సురేష్ గజపతినగరం నియోజకవర్గంలో చేబడుతున్న పల్లెపల్లెకు జనసేన కార్యక్రమంలో భాగంగా పద్దెనిమిదో రోజైన ఆదివారం గంగచోళ్ళ పెంట గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో నాయకులు సురేష్ మాట్లాడుతూ గజపతినగరం నియోజకవర్గంలో పల్లె పల్లెకు జనసేన కార్యక్రమంలో భాగంగా మా జనసైనికులు, నాయకులతో ప్రతీ ఇంటికి వెళ్లి పార్టీ సిద్ధాంతాలతోను, జనసేన పార్టీ చేబడుతున్న కార్యక్రమాల వివరాలతో కూడియున్న కరపత్రాలను ప్రజలకు వివరిస్తూ పంచిపెట్టామని, ప్రజలంతా ఎన్నో సమస్యలను అడగకముందే చెప్పి వాపోతున్నారని, అర్హులమైనా పెన్షన్లు గాని, ఇల్లులు, డ్వాక్రా రుణ సదుపాయాలు కల్పించట్లేదని, అదే రైతుల గోడు అయితే వర్ణణాతీతమని పంటలకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వట్లేదని, విత్తనాలకైతే డబ్బులు ముందు కడితేగాని తేవడంలేదని, రైతుభరోసా కేంద్రాలు ఎందుకు పెట్టారో, ఎప్పడూ మూసివేసే ఉంటాయని ప్రజలంతా ఇటువంటి ఎన్నో సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నారని అన్నారు. రైతులకు భాదించిన ఏ ప్రభుత్వం బట్టకట్టలేదని, జనసేన ప్రజల పక్షాన నిలబడి జిల్లా కలెక్టర్ కు, అధికారులకు వినతిపత్రాలు ఇచ్చి ప్రజలకు న్యాయం జరిగే వరకు మావంతు కృషిచేసి పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు అదాడ మోహనరావు, మిడతాన రవికుమార్,ఆదినారాయణ, పండు, హరీష్ నాని,శ్రీను కడమల, వెంకటరమణ, సాయి, సూర్యప్రకాష్, వినోద్, ఆదిత్య, హరి తదితరులు పాల్గొన్నారు.