జోనల్ కమిషనర్ కు జనసేన 88 వార్డ్, నరవ గ్రామ సమస్యల సెగ

విజయనగరం: 88 వార్డ్, పెందుర్తి నియోజకవర్గం, నరవ గ్రామంలో జీవీఎంసీ స్వచ్ఛ సర్వేక్షన్ పర్యటనలో భాగంగా జోనల్ కమిషనర్ సింహాచలంను అపి గ్రామ సమస్యలను వివరించిన జనసేన పార్టీ స్థానిక నాయకులు వబ్బిన జనార్దన శ్రీకాంత్.. జోనల్ కమిషనర్ తో మాట్లాడుతూ ఈ నరవ గ్రామం జీవీఎంసీలోకి తీసుకొని దశాబ్ద సంవత్సరాలు గడిచిన అభివృద్ధి కి మాత్రం ఆమడ దూరంలో ఉందని, ముఖ్యంగా నాణ్యమైన త్రాగునీటి సమస్య, వీధిలైట్లు డ్రైనేజీ లేకపోవడం వలన మన్ని పాలెం, రెల్లి వీధి, ఇలా కొన్ని కాలనీల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో కూడా వీధిలైట్లు ఏర్పాటు చేయడం లేదని, పాడైపోయినవి మరమ్మతులు కూడా చేయటం లేదని, మాకు కళ్యాణ మండపం అందుబాటులో ఉన్నప్పుడు ప్రజలుకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది, దయచేసి సచివాలయాన్ని వేరే ప్రదేశానికి మార్చే కళ్యాణ మండపం అందుబాటులో తీసుకొని రావాలని, మా గ్రామానికి 10 పడకల హాస్పిటల్ మంజూరైనప్పటికీ అధికారులు, ప్రజా ప్రతినిధుల అవగాహనలోపం వలన వెనక్కి వెళ్లిపోయిందని కావున మాకు పది పదకల హాస్పిటల్ వచ్చేలాగా కృషి చేయాలని ఇది మా చుట్టూ పక్క గ్రామాల అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, బెహరా కాలేజ్ నుండి రామాలయం వద్ద ఇరువైపులా మరియు హనుమాన్ టెంపుల్ నుండి మాజీ సైనిక సంక్షేమ కార్యాలయం వరకు డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, మహిళలకు కుటీర పరిశ్రమ మీద అవగాహన కల్పించి ఆర్థిక భరోసా కలిగేలాగా కృషి చేయాలని, స్థానిక యువతుకు జీవీఎంసీలో ఉన్న ఉద్యోగాలను కృషి చేయాలని, స్మశాన వాటికి సరిపడే నిధులు మంజూరు చేసి ప్రహరీ గోడ కంప్లీట్ చేయాలని, షీలానగర్ నుండి నరవ రహదారి నిర్మాణం 2018 ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేయలేదని, దయచేసి మా గ్రామ ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని కోరడం జరిగింది, ఈ యొక్క కార్యక్రమంలో గవర శీను, బొడ్డు నాయుడు, గోపిసెట్టి ప్రవీణ్, రామ్, ప్రసాద్, పరమేశు, మరియు జనసైనికులు ప్రజలు పాల్గొన్నారు.