హైకోర్టు పరీక్షలకు జనసేన ఉచిత శిక్షణా శిబిరం

అమలాపురం: డా.బి.ఆర్.అంబేడ్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకుని అమలాపురం టీమ్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో, జనసేన నాయకులు డి.యం.ఆర్ శేఖర్ సౌజన్యంతో హైకోర్టు మరియు జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబందించి ఉచిత శిక్షణా తరగతులు మంగళవారం ప్రారంభించారు. తొలుత అంబేడ్కర్ చిత్ర పటానికి పూల మాలాంకృతం చేసి, జోహార్లు అర్పించారు. ఈ శిబిరం స్థానిక జనసేన పార్టీ ప్రాంగణంలో (నల్లా శ్రీధర్ ఇంటి వద్ద) 15 రోజుల పాటు కొనసాగుతుందని, ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకూ జరుగుతాయని జనసేన నాయకులు డి.యం.ఆర్ శేఖర్ తెలిపారు. చాలా మందిలో అవగాహన లేని ఇటువంటి పరీక్షలకు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అందరికీ ఇలా ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగం పొందే దిశగా నిష్ణాతులైన అద్యపకులచే నాణ్యమైన శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సదావకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ సతీష్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మాకినీడి ఆదినారాయణ, కంచిపల్లి అబ్బులు, ఇసుకపట్ల రఘుబాబు, ఆకుల సూర్యనారాయణ మూర్తి, ఆర్.డి.యస్.ప్రసాద్, నాగ మానస, పడాల నానాజీ, గుర్రాల రాంబాబు, సుమారు 60 మంది అభ్యర్థులు పాల్గొన్నారు.