గుగ్గిళ్ళ వెంకటయ్య(డీలర్) కు జనసేన నివాళులు

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని వీరబల్లి మండల పరిధిలో సానిపాయి గ్రామపంచాయితీ నేతివాండ్లపల్లిలో రాజంపేట నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు గుగ్గిళ్ళ నాగార్జున తండ్రి వెంకటయ్య(డీలర్) దశదిన కార్యక్రమంలో భాగంగా జనసేనపార్టీ తరపున ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి కీర్తన, చిత్తూరు జిల్లా కార్యదర్శి కొట్టేసాయి, రామ శ్రీనివాస్, వీరబల్లి, సుండుపల్లి, మండలాల జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.