రాజంపేట జనసేన పార్టీ ఆఫీసులో కాలెండర్లను ఆవిష్కరించిన జనసేన

రాజంపేట ఇన్చార్జి శ్రీ మలిశెట్టి వెంకటరమణ సూచనల మేరకు గురువారం రాజంపేట జనసేన పార్టీ ఆఫీసులో జనసేనకు బహుకరించిన 99 ట్వ్, తరుణం, ఈనాడు, విశాలాంధ్ర, న్యూస్ నౌ, ఆంధ్ర పత్రిక, కాలెండర్లను ఆవిష్కరించడము జరిగింది. మీడియా యాజమాన్యం నూతన సంవత్సర క్యాలెండర్లను రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జి శ్రీ మలిశెట్టి వెంకటరమణ కి అందజేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదములు. ప్రజాస్వామ్య దేశంలో మీడియా ప్రముఖపాత్ర పోషించాలి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మీడియా పాత్ర అభినందించదగిన విధంగా ఉంది. మన రాష్ట్రంలో కూడా మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తోంది. కానీ కొన్ని పత్రికలను, కొన్ని టీవీ చానెళ్లను వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్థాపించడం వలన ఆ పార్టీ అధ్యక్షుడికి, ఆ పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ ప్రజాస్వామ్యాన్ని హరించి వేస్తూ, అబద్ధాలు, అసత్యాలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. మన రాష్ట్రంలో ఇంకా చదువుకొని వారు ఉండటం వలన, అదే సమాచారాన్ని నమ్మి మోసపోతున్నారు. ఈ అవివేకంతో రాజకీయ నాయుకులు వారి సొంత డబ్బులు ఇస్తున్నారని ప్రజలు నమ్ముతున్నారు. ప్రభుత్వం డబ్బులతో పధకాలు నడుపుతూ, జగన్ మోహన్ రెడ్డి అన్ని పథకాలకు వారి పేరు, వారి నాన్న గారి పేరు పెట్టుకుని, ప్రజలు వారే ఇస్తున్నారనే భ్రమలో ఉన్నారు. ఇటువంటి మూఢ నమ్మకాలను ప్రజల నుంచి తొలగించవలసిన బాధ్యత ప్రతి మీడియా భాద్యత. రాజంపేట నియోజక వర్గంలోని ఆరు మండలాల్లో జనసేన పార్టీ ఇంచార్జి శ్రీ మలిశెట్టి వెంకటరమణ సూచనల మేరకు ఎలా సమస్యలను పరిస్కరిస్తున్నారో మీ ద్వారా ప్రజలకు తెలియ జేయాలని మనవి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జనసేన రాష్ట్ర వికాస కార్యదర్శి రాటల్లా రామయ్య, జనసేన కడప జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు కత్తి సుబ్బరాయుడు, బండ్ల రాజేష్, పోలిశెట్టి రజిత, శంకరయ్య, గోపి మన్నూరు, సంగరాజు నవీను, నారా కిషోర్, అలాగే జనసేన పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది.