జనసేన విజయ యాత్ర – ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ – 65వ రోజు

  • గ్లాసు సింకులో ఉంటే మరుసటి రోజు కడిగి ఉపయోగించవచ్చు, ఫ్యాన్ రెక్కలు విరిగితే పైసాకి పనికిరాదు

శ్రీకాళహస్తి నియోజకవర్గం: జనసేన విజయ యాత్ర 65వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారంలో భాగంగా గురువారం శ్రీకాళహస్తి పట్టణంలోని బస్టాండ్ సెంటర్ నుండి పెళ్లి మండపం వరకు మరియు గాంధీ వీధిలో పట్టణ ఉపాధ్యక్షులు జ్యోతి రామ్ ఆధ్వర్యంలో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించిన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా.
వినుత కోటాకి క్రేన్ ద్వారా బారీ గజమాలతో, పూల వర్షంతో, బాణసంచాతో, వాయిద్యాలతో, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికిన నాయకులు, జనసైనికులు. ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టి కింద పడేసి వినుత కోటా ప్రభుత్వంపై నిరసన తెలిపారు. టౌన్ లో ప్రచారం నిర్వహించి రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న జనసేన పార్టీ ని, పవన్ కళ్యాణ్ గారిని ఆదరించాలని, నియోజకవర్గంలో శ్రీమతి వినుత కోటా గారిని ఆశీర్వదించి, గాజు గ్లాసు గుర్తు కి ఓటు వెయ్యాలని ప్రజలను కోరడం జరిగింది. మార్పు కోసం జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తోట గణేష్, నాయకులు జ్యోతి రామ్, పేట చిరంజీవి, రవి కుమార్ రెడ్డి, పేట చంద్ర శేఖర్, దండి రాఘవయ్య, రవి కుమార్ రెడ్డి, లక్ష్మి, రాజ్య లక్ష్మి, కవిత, శారద, రాజేష్, సురేష్, హేమంత్ గౌడ్, పెద్ద ఎత్తున నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.