జనసేన గ్రామశాఖ అధ్యక్షులు చినబాబుకి సన్మానం

రాజోలు మండలం, పొదలాడ గ్రామానికి చెందిన పంచదార చినబాబుకి ఉత్తమ సేవా అవార్డు లభించిన కారణంగా రాజోలు 4 షో థియేటర్ల అధినేత డాక్టర్ పాలిక శ్రీనివాసబాబు చినబాబుని సన్మానించారు. సామాన్య జీవనం సాగిస్తున్న చినబాబు తన కొద్దిపాటి ఆదాయంలో పేదలకు సహాయ సహకారాలు అందించడంలోను మరియు కరోనా సమయంలో విశిష్ట సేవలు అందించి ప్రజల హృదయాల్లో చినబాబు చిరస్థాయిగా నిలిచారని డాక్టర్ శ్రీనివాసబాబు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొటికలపూడి సత్యనారాయణ, కొణతం నారాయణరావు, బత్తుల రవి, యనమనల రవి, రాజేష్, సురేష్, మామిడిశెట్టి తాతయ్య పాల్గొన్నారు.