పి.రాయవరంలో జనసేన గ్రామ కమిటీ సమావేశం..

పిఠాపురం నియోజకవర్గం, జనసేన ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషు కుమారి ఆధ్వర్యంలో పిఠాపురం మండలం పి. రాయవరం గ్రామంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ముందుగా నాయకులు, జనసైనికులతో కలిసి అక్కడ ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి పూలమాలవేసి, జై భీమ్ చెప్పి, గ్రామ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముందుగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు, కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ గారు ఆదుకున్న విషయాలు, జనసైనికులకు క్రియాశీలక కార్యకర్త కోసం ఆ కుటుంబ సభ్యులను ఆదుకునే విధానాల కోసం ఆయన కోట్ల రూపాయలను కాదనుకుని ప్రజాసేవ దిశగా ప్రయాణిస్తున్నారని తెలియజేసారు. ఇప్పుడున్న అధికార రౌడీలు ఇష్టానుసారంగా పిచ్చి మాటలు అంటున్నారు. అరే మీలాగా అయినా ఆయన లక్ష కోట్లు దోచుకోలేదు, కోట్లలో ప్రజల గుండెల్లో స్థానం పెంచుకున్న వ్యక్తి. 25 కేజీల బియ్యం కాదు, 25 సంవత్సరాలు భవిష్యత్తు ఇస్తానని వచ్చిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన పవన్ కళ్యాణ్ గారిని తెలియజేశారు. అలాగే గ్రామ కమిటీ అంటే ఒక పదవి కాదు, ఒక బాధ్యతని గుర్తు చేసి ప్రతి ఒక్కరూ కూడా పార్టీకి సోల్జర్స్ లా పనిచేయాలని, ప్రతి జనసైనికులను, నాయకులను కలుపుకొని పోయి వారికి అండగా కష్టకాలంలో బలంగా నిలబడమని వారికి సూచించి, గ్రామ కమిటీ నియమించటం జరిగిందని గ్రామ ప్రెసిడెంట్ గా మాదేపల్లి పద్మరాజు నియమించారు. అలాగే పిఠాపురం నియోజవర్గం అంతా కూడా గ్రామ కమిటీ వేసి పార్టీని మరింత బలంగా చేసే విధంగా అడుగులు వేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గోపు సురేష్, మాదేపల్లి పద్మరాజు, అడ్వకేట్ సిరిపురెడ్డి గణేష్, కట్ట బంగారు రాజు, కొంగు వెంకటరమణ, మాదేపల్లి రాజా, జి. దుర్గాప్రసాద్, వై.అప్పాజీ, బోడపాటి చిన్న, పెద్దపూడి రామకృష్ణ, మొగలి అంజి, కట్ట శివశంకర్, బావిశెట్టి దుర్గాప్రసాద్, ఠాగూర్, బోడపాటి శ్రీను, ఎస్ వీర నగేష్, మారిశెట్టి సుబ్బారావు, కారపురెడ్డి భద్రరావు, మాగాపు చంటి, గుండ్ర రాంబాబు, సిరిపురెడ్డి రాంబాబు, సీలు అజయ్, మొగలి అర్జున్ రావు, గుండ్ర పూసలు, బెజవాడ సత్తిబాబు, బెజవాడ ప్రసాద్, ఒబా అనిల్, దేశిలంక శేఖర్, కాకాడ ఏసు, బర్రె అనిల్ కుమార్, కాటూరి నవీన్, బక్కే సూరిబాబు, కాటూరి విజయ్, కాటూరి రాజు, బోడ గణేష్, మాదేపల్లి వెంకన్న, మణికంఠ, కంద సోమరాజు, దేశి రెడ్డి సతీష్, రౌతు శివ బాబు, అంబేద్కర్ యూత్, గ్రామ పెద్దలు, జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.