జనసేన గ్రామీణ అధ్యక్షుడు చక్రవర్తి జన్మదిన సందర్భంగా చెట్టుపల్లిలో పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు, పాలు, పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ

నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు జన్మదిన సందర్భంగా చెట్టుపల్లి గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు, పాలు, పండ్లు మరియు బ్రెడ్డు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చక్రవర్తి మాట్లాడుతూ జనసేన రాష్ట్ర నాయకులు ఆశీస్సులతో పాటుగా నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ రాజన్న వీర సూర్యచంద్ర అడుగుజాడల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేస్తూ తమ వంతు కృషిగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ఆశయాలను గ్రామ గ్రామాన చేరవేస్తూ పార్టీని పటిష్టపరిచేందుకు ప్రయత్నం చేస్తున్నామని శ్రీ పవన్ కళ్యాణ్ సేవాభావం ఆదర్శంగా తీసుకుని పుట్టినరోజు వేడుకలకు దూరంగా సేవాభావం ఆదర్శప్రాయంగా ఉండేందుకు జనసేన పార్టీలో అత్యధికులు యువకులే ఉంటారు కావున వారందరికీ మేము ప్రేరణ కావాల్సి ఉంది కాబట్టి సేవా దృక్పథంతో సేవా కార్యక్రమాలతో పాటుగా ప్రజల సమస్యలను నిత్యం అధికారుల దృష్టికి తీసుకు వెళుతూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని నర్సీపట్నం నియోజకవర్గంలో జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ మధ్యన జరిగినటువంటి ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు మరియు విజయం సాధించినటువంటి విజేతల సహాయ సహకారాలతో మరింత జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాము అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చక్రవర్తి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.