గంగాపురం గ్రామంలో జనసేన గ్రామ బాట

జనసేన గ్రామ బాట 4వ రోజు

పార్వతీపురం: జనసేన గ్రామ బాట ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పార్వతీపురం మండలంలో వున్న ప్రతి గ్రామంలో జనసేన నాయుకులు, జనసైనికులు, వీరమహిళలు పర్యటించి జనసేన పార్టి యొక్క సిద్దాంతాలు తెలియజేస్తూ పార్టీని గ్రామంలో బలోపేతం చేయడం మరియు ప్రజలు సమస్య తెలుసుకొని వాటికి సంభంధించిన అధికారులకు జనసేన పార్టి తరుపున తెలియజేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం కోసం ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 4వ రోజు పార్వతీపురం మండలం, గంగాపురం గ్రామంలో పార్వతీపురం మండల అధ్యక్షురాలు ఆగురు మణి మరియు రూరల్ టీం అద్వర్యంలో జనసేన గ్రామబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది.