Nellore: సూళ్లూరుపేట నియోజకవర్గంలో జనసేన గ్రామ పర్యటన

జనసేనపార్టీ గ్రామ పర్యటనలో భాగంగా జనసేనపార్టీ నెల్లూరు జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీ బూరకల లీలా మోహన్ సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారి సత్రం మండలంలోనీ చవటకండ్రిగ, పూలతోట, ఎక్కొల్లు గ్రామాలలో పర్యటించి అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రోడ్లు, డ్రైనేజీ కాలవలు, నేరుగా వారి ఇంటికి వెళ్లి తెలుసుకోవడం జరిగింది. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి గ్రామంలోని సమస్యలను పరిష్కారం జరిగే విధంగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు దువ్వూరు సనత్ కుమార్, యోగేష్, వెంకయ్య, సుబ్రహ్మణ్యం, ముని రాజా, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.