ప్రమాదంలో గాయపడిన కళాకారుల బృందాన్ని పరామర్శించిన జనసేన

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన కళాకారులు బృందం ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడి రాజమహేంద్రవరం సాయి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సూరిశెట్టి అవతారం, కర్రీ దుర్గా, పంటకోట దుర్గాప్రసాద్, సూరిశెట్టి నాయుడు, పెంటకోట గణేష్, ఆకుల సాయి, కర్రీ నానాజీ కాళ్ళ ప్రసాద్ లను రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ అదేశాల మేరకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంట స్వరూప దేవి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి మైరెడ్డి గంగాధర్, రాజానగరం మండల కన్వీనర్ బత్తిన వెంకన్న దొర చదువు ముక్తేశ్వరరావు మరియు శ్రీరంగపట్నం జనసైనికులు తన్నీరు తాతాజీ, అడపా అంజి, దొడ్డి అప్పలరాజు, అటుకులశెట్టి శ్రీనివాస్, చలపతి పరామర్శించడం జరిగింది.