ఇల్లు దగ్ధమై కట్టుబట్టలతో మిగిలిన కుటుంబానికి బాసటగా జనసేన

*ఇల్లు దగ్ధమై కట్టుబట్టలతో మిగిలిన మన్నెం లక్ష్మి కుటుంబానికి పిడుగురాళ్ళ మండల జనసేన పార్టీ మరియు నియోజకవర్గ చిరంజీవి యువత చేయూత.

గురజాల, ఇటీవల కాలంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో.. పూర్తిగా ఇల్లు దగ్ధమై కట్టుబట్టలతో మిగిలిన కుటుంబానికి పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో.. ఆ కుటుంబాన్ని పరామర్శించి పదకొండు వేల రూపాయలు ఆర్థిక సహాయం, 25 కేజీ బియ్యం అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ళ మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్, నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షుడు ఎర్నాన రామకృష్ణ, మాచవరం మండల అధ్యక్షుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, జనసేన నాయకులు బయ్యవరం రమేష్, గుర్రం కోటేశ్వరరావు, మన్నెం పూర్ణ, మల్లెల రామాంజి, బేతంచెర్ల ప్రసాద్, సతీష్, ఆవుల రమేష్, ఆదిత్య, రామంజి, తదితరులు పాల్గొన్నారు.