మలికిపురం ప్రజల దాహార్తికి జనసేన వాటర్ ట్యాంకర్

కోనసీమ జిల్లా, రాజోలు వేసవి కాలంలో నీటి ఎద్దడికి ప్రజలు ఇబ్బంది పడుతుండడంతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ప్రతిరోజు ప్రజలకు మంచినీళ్ళు అందేవిధంగా వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాటర్ ట్యాంక్ ద్వారా గురువారం మలికిపురం గ్రామం, ఆదర్శనగర్ లో(కాలేజ్ వెనుక)నీరు అందక ఇబ్బందిపడుతున్నవారికి కేశనపల్లికి చెందిన అడబాల శ్రీఆంజనేయులు & సన్స్ వారి (ట్రాక్టర్ డిజల్ )ఖర్చులతో మలికిపురం జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగిందని జనసేన నాయకులు నామన నాగభూషణం తెలియచేయడం జరిగింది.