రామచంద్రపురం గ్రామంలో ఇంటింటికి జనసేన విస్తృత ప్రచారం

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రామచంద్రపురం గ్రామంలో ఆదివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేనపార్టీ నాయకులు సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్ కరిమజ్జి మల్లీశ్వారావు మరియు జనసేన పార్టీ యంపిటిసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు రామచంద్రపురం గ్రామ ప్రతి గడప గడపకు, ఇంటింటికి వెళ్ళి జనసేనపార్టీ సిద్దాంతాలు మరియు మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ప్రతి ఇంటికి, ప్రతి మహిళకు, పెద్దలకు పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్రలో భాగంగా 3000మంది కౌలు రైతులు చనిపోయారని, వాళ్ళు కుటుంబాలను నేరుగా పరామర్శించి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. ఇలాంటి నాయకుడిని కాపాడుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆదివారం ఉదయం రామచంద్రపురం గ్రామంలో ఇంటింటికి కార్యక్రమంలో మరియు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ… ఇలాంటి సేవాకార్యక్రమాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని కోరారు. పవనన్న ప్రజాబాట 70రోజులు సుదీర్ఘంగా ప్రజలు దగ్గరకు వెళ్ళి ప్రతి విషయాన్ని వివరించాము, ప్రజలనుండి అపూర్వమైన స్పందన లభిస్తుందన్నారు. ఈసారి జనసేనపార్టీకి అవకాశం ఇవ్వాలని గాజు గ్లాసుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం గ్రామపెద్దలు మరియు మహిళలు పాల్గొన్నారు.