*“రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనే ఆకాంక్షలో ఉన్నారు”
*ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ రెడ్డి అప్పల నాయుడు
ఏలూరు, జూన్ 29 : స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో కీలక అంశాలపై చర్చ నిర్వహించారు. సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై జరిగిన ఈ సమాలోచన సమావేశానికి ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ రెడ్డి అప్పల నాయుడు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “రాష్ట్ర ప్రజలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ సమర్థతతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది. సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి అనే మూడు ప్రధాన దిశల్లో ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది,” అని తెలిపారు. ఈ సమావేశంలో నియోజకవర్గ స్థాయిలో సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తు ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయాన్ని సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగింది. ఏలూరులోని 50 డివిజన్లలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త, నాయకుడు కృషి చేయాల్సిందిగా ఆయన సూచించారు. లోటుపాట్లు ఉంటే సమన్వయంతో సరిచేసుకుని ముందుకు సాగాలని పేర్కొన్నారు. “జనసేన ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. కూటమి విజయమే రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన బాట. ప్రజల్లో విశ్వాసాన్ని మరింతగా బలపరిచేలా వ్యవహరించాలి. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలి. ప్రజలకు ఈ ప్రభుత్వం అందుతున్న అభివృద్ధి, సంక్షేమం వివరించాలి” అని అన్నారు. ఈ సమావేశానికి మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, జనసేన నాయకుడు నారా శేషు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమావేశంలో రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్లా శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. అలాగే రెడ్డి గౌరీ శంకర్, వీరంకి పండు, నగిరెడ్డి కాశీ నరేష్, సరిది రాజేష్, శానం రామకృష్ణ, పి. జగన్, పెదబాబు, కట్టా ఆది, నరేష్, అరవింద్, కె. శ్రీను, దోసపర్తి రాజు తదితర ప్రముఖులు, వీర మహిళలు కావూరి వాణిశ్రీ, గుదే నాగమణి, తాబేలు హిమబిందు, వెలగా గాయత్రి, కొసనం ప్రమీల, జొన్నలగడ్డ సుజాత, యడ్లపల్లి మమతా, డివిజన్, బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:
Post Comment