జనసేన క్రియాశీలక కార్యకర్తకు ప్రమాద భీమా చెక్కు అందజేత

వైరా, జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండేందుకు జనసేన అద్యక్షులు పవన్ కళ్యాణ్ తీసుకువచ్చిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వంలో భాగంగా ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త ఇజ్జగాని వేణు గోపాల్ ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడటం జరిగింది. ఇందుకుగాను అతనికి మంజూరైన క్రియాశీలక సభ్యత్వ భీమా 50 వేల రూపాయల చెక్కును ఆదివారం వైరా నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో భాగంగా ఆ చెక్కును తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ మరియు వైరా నియోజకవర్గ ఇంచార్జ్ సంపత్ నాయక్ ఆ చెక్కును కార్యకర్త వేణుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రియాశీలక వాలంటీర్ షేక్ పాషా మరియు వైరా నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.