డిజిటల్ క్యాంపెయిన్ లో పాడేరు జనసేన

పాడేరు నియోజకవర్గం ప్రధానకూడలి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాట్యూ దగ్గర జనసేన పార్టీ తరుపున ప్లకార్డ్స్ తో డిజిటల్ క్యాంపెయిన్ జరిగింది. ముఖ్య అతిధిగా(పాడేరు)జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డాక్టర్ శ్రీ వంపూరు గంగులయ్య పాల్గొన్నారు. జనసైనికులతో మానవ హారంగా ఏర్పడి రాస్తారోకో చేస్తూ ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రయివేటికరణ చెయ్యడానికి ఎందుకు తొందరపడుతుందని,పార్లమెంట్ లో వైస్సార్సీపీ ఎంపీలు ఎందుకు పార్లమెంట్ లో ఈ అంశం మీద ఎందుకు నోరు మెదపట్లేదు, ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయివేటికరణను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి ఏమి సాధించాలని చూస్తుందని ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రయివేటికరణ చేస్తూ పోతే రానున్న భవిష్యత్ తరాలకు మనం ఏం ఇస్తున్నట్లు? రాష్ర్టం విపరీతమైన దోపిడీ వ్యవస్థగా మార్చేసింది కేవలం వైస్సార్సీపీ అని ఈ పాలనలో ప్రజలు విపరీతమైన కష్టాలకు గురౌతున్నారని ప్రజలు ఇప్పటికైనా మేల్కొలేకుంటే ఇంకా ప్రభుత్వరంగా సంస్థలన్నీ ఫ్రీవేటికరణ చేస్తూ పోతారని డాక్టర్ గంగులయ్య ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. ఆదివాసీ ప్రజలకు రిజర్వేషన్ ఫలాలు అందాలంటే ప్రభుత్వరంగ పరిశ్రమలు కీలకమని ఆ విషయం ప్రజలు గమనించాలని రానున్నది జనసేన ప్రభుత్వమని ప్రసంగించారు. ఈ ప్లకార్డ్స్ కార్యక్రమములో ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక పాలన వ్యవస్థని దుయ్యబట్టారు. జనసేన అధినేత ఆదేశాల మేరకు మేము పోరాటానికి ఎప్పటికి సిద్ధంగా ఉంటామని మేము ఎప్పటికి ప్రజల పక్షమేనని అందుకే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇది కేవలం ఒక స్లోగన్ కాదని కొన్ని కోట్ల మంది ప్రజలు ఆత్మాభిమనంతో ముడిపడి ఉన్న అంశమని ఈ విషయంలో ఎంపీలు తగిన రీతిలో పార్లమెంట్ లో పోరాటం చేయకపోవడం విడ్డురంగా ఉందని ఇందుకేనా వైస్సార్సీపీకి 22 మంది ఎంపీలు ప్రజలు ఇచ్చారని వీరంతా కాగితం పులులని ఎద్దేవా చేసారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరామ్, పార్లమెంట్ కమిటీ సభ్యులు, కొర్ర కమల్ హాసన్, పాడేరు జనసేన మహిళా నాయకురాలు కిట్లాంగి పద్మ, పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు సాలేబు అశోక్, మజ్జి సత్యనారాయణ, కిల్లో అశోక్, వంపూరు సురేష్, కోటి, పవన్ తేజ్, పాడేరు మండల అధికార ప్రతినిధి, దివ్యలత, దుర్గలత, తదితర జనసైనికులు పాల్గొన్నారు.