బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉంటుంది

పల్నాడు జిల్లా, గురజాల, మాచవరం మండలం పిల్లుట్ల గ్రామంలోని మహిళ ఐదేళ్ళ నుండి భర్తతో మనస్పర్థలు ఏర్పడి ఇద్దరి మద్య గొడవలు జరుగుతున్న తరుణంలో నర్సరావుపేట పట్టణానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి జోక్యంతో ముదిరిన గొడవ విడాకుల వరకు వచ్చిందని, శ్రీనివాసరెడ్డి కులం పేరుతొ దూషించి, తన మెడలోని తాళిని లాగే ప్రయత్నం కూడా చేశాడని నాకు నర్సంపేట ఎమ్మెల్యే, గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే సపోర్ట్ ఉందని వాళ్ళు మావాళ్ళే అని మీరు ఏమీ చేయలేరని భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని, మహిళ ఆవేదన వ్యక్తం చేసింది, ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి ఐదు నెలలు గడుస్తున్నా చార్జ్ షీట్ నమోదు చేయలేదని ఆధారాలు పోయాయంటూ మరలా మొదటి నుండి విచారణ చెప్పాడుతాం అని చెప్పడం కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని బాధిత మహిళ జనసేన నాయకులముందు వాపోయింది. ఈ సందర్బంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ఎస్టి సామాజికవర్గ మహిళపై శ్రీనివాసరెడ్డి కులం పేరుతో దూషించి, తన తాళి బొట్టు లాగే ప్రయత్నం చేయడం దుర్మార్గమైన చర్య అని, వెంటనే నిందితునిపై తగు చర్యలు తీసుకోవాలని, బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు బాధిత మహిళ పక్షాన జనసేన నిలబడుతుందని, వారికి అండగా జనసేన ఉంటుందని, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ వెంటనే ఈ ఘటన సంబంధించి ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు స్పందించక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని, ఇప్పటికైనా స్పందించి బాధితులకు న్యాయం చేయాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అంబటి మల్లి, జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల ఖాసీం సైదా, మాచవారం మండల అధ్యక్షులు బొమ్మ శ్రీను, పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్, జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు దూదేకుల సలీం, బయ్యావరపు రమేష్, బేతంచెర్ల కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, అశోక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.