రైతులను అన్ని విధాలుగా జనసేన ఆదుకుంటుంది: మహబూబ్ మస్తాన్

ఆత్మకూరు: జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, అనంత సాగరం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు షేక్ మహబూబ్ మస్తాన్, అనంతసాగరం మండలంలోని పాత దేవరాయపల్లి బిట్ -1 పంచాయతీలోని మాగాణీ భూముల్లో పర్యటించి రైతులు, కూలీలను కలిసి జనసేన పార్టీ ప్రభుత్వ అధికారంలోనికి వస్తే రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న రైతులకు తన కష్టార్జితంతో సంపాదించిన డబ్బును 30 కోట్లు డబ్బును 3 వేలుమంది రైతులకు ఒక్కొక్క కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఇస్తున్నారని తెలియజేయడం జరిగింది. జనసేన ప్రభుత్వం అధికారంలోనికి వస్తే చిన్న కారు, సన్న కారు రైతులకు నెలకి 5 వేలు రూపాయలు పెన్షన్ ఇచ్చి, సంవత్సరానికి రైతు భరోసా కింద 8000 రూపాయలు రైతు ఖాతాలో జమ చేస్తామని రైతులు పంట పండించిన తర్వాత పంటను ప్రభుత్వమే కొని దళారులు వ్యవస్థ లేకుండా చేస్తామని చెప్పడం జరిగింది.