దామోదరం సంజీవయ్య విగ్రహ ఏర్పాటుకు జనసేన కృషి చేస్తుంది: నేరేళ్ళ సురేష్

గుంటూరు, దేశ తొలి దళిత ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి దివంగత దామోదరం సంజీవయ్య విగ్రహాన్ని గుంటూరు నగరంలో ఏర్పాటు చేసేందుకు జనసేన పార్టీ కృషి చేస్తుందని జనసేన పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్షులు నేరేళ్ళ సురేష్ అన్నారు. దామోదరం సంజీవయ్య 51 వ వర్ధంతి సందర్భంగా సోమవారం నగర పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ తన జీవిత పర్యంతం పేద బడుగు బలహీనవర్గాల కోసమే బ్రతికిన గొప్ప వ్యక్తి దామోదరం సంజీవయ్య అని కొనియాడారు. నాడు క్యాబినెట్లో పది సంవత్సరాలు వివిధ శాఖల మంత్రిగా, రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా సొంత ఇల్లు కూడా కట్టుకోలేనంత నిరాడంబరంగా జీవించిన దామోదరం సంజీవయ్యను నేటి రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని సురేష్ అన్నారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ అట్టడుగు స్థాయి వర్గాల ప్రజలకు అండగా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన పెట్టిన మొట్టమొదటి నేత దామోదరం సంజీవయ్య అని పేర్కొన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చిన ముఖ్యమంత్రి కూడా దామోదరం సంజీవయ్య మాత్రమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి, సుధా నాగరాజు, సంయుక్త కార్యదర్శులు పులిగడ్డ గోపి, కొడిదేటి కిషోర్, బొందెల నాగేంద్ర సింగ్, బందెల నవీన్ బాబు, మరియు, 5 డివిజన్ ప్రెసిడెంట్ యాట్ల దుర్గాప్రసాద్, 12 డివిజన్ ప్రెసిడెంట్ కొనిదే దుర్గాప్రసాద్, 7 డివిజన్ ప్రెసిడెంట్ ఎస్.కె రజాక్, మిద్దె నాగరాజు, వీర మహిళ ఆశ తదితరులు పాల్గొన్నారు.