కొండేపి నియోజకవర్గంలో జనసేన విజయం సాధిస్తుంది: షేక్ రియాజ్

ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ ని కొండేపి నియోజకవర్గంలో ఆరు మండలాల అధ్యక్షులు సోమవారం కలవడం జరిగింది. ఈ సందర్భంగా షేక్ రియాజ్ మాట్లాడుతూ.. అతి తొందరలో కొండేపి నియోజకవర్గానికి ఇన్చార్జిని ప్రకటించడం జరుగుతుంది. 2024 లో కొండేపి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఖచ్చితంగా విజయం సాధించడం జరుగుతుంది. 6 మండలాల్లో “జనంలోకి జనసేన” కార్యక్రమంకి మంచి స్పందన వస్తుంది, కొండేపి నియోజకవర్గంలో ప్రజలకు సమస్య వస్తే.. జనసేన పార్టీ ముందు ఉండి ప్రజల పక్షాన పోరాడి.. సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది. చాపకింద నీరులాగా జనసేన పార్టీకి కొండేపి నియోజకవర్గంలో అనూహ్యమైన స్పందన లభిస్తుంది. ప్రజలకు ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుంది.. మరియు మండల అధ్యక్షులు కూడా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాన్ని మేము ఎండగడతాం, ప్రజలకు అండగా ఉంటాం, కొండేపి నియోజకవర్గంలో ప్రజలకు సమస్య వస్తే జనసేన పార్టీ దృష్టికి తీసుకురండి, ప్రజల పక్షాన నిలబడి న్యాయబద్ధమైన పోరాటం చేసి ప్రజలకు అండగా ఉంటాం అని తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో.. కనపర్తి మనోజ్ కుమార్, అయినాబత్తిన రాజేష్, చంద్రశేఖర్, శశిభూషణ్, రాంబాబు మరియు శ్రీకాంత్ లు మొదలైనవారు జిల్లా అధ్యక్షుని కలవడం జరిగింది.