పినపళ్ల గ్రామంలో జనసేన కార్యవర్గ సమావేశం

*ముందుండి నడిపించిన జన సైనికుడు, యువనాయకుడు గ్రామ సర్పంచ్ సంగీత సుభాష్
*గ్రామ పెద్దలు, జనసైనికులు.

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని, ఆలమూరు మండలంలోని, పినపళ్ల గ్రామంలో శుక్రవారం రాత్రి 9 గంటలకు అతి భారీ ఎత్తున గ్రామ ప్రజల సమక్షంలో, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మీటింగు కొరకు సమావేశం జరిగినది. ఈ సమావేశంలో గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక్కొక్క కార్యకర్త చొప్పున ఎక్కడా తగ్గకుండా సమావేశమునకు వచ్చి, జనసేన కార్యవర్గం సమావేశం పెద్ద ఎత్తున గొప్పగా నిర్వహించారు. అనంతరం క్రియాశీల సభ్యత్వ నమోదు పలు అంశాలపై గ్రామ సమస్యలపై, పలువురు నాయకులు, సర్పంచ్ సంగీత సుభాష్ మాట్లాడారు, జనసేన పార్టీకి జనసేనానికి అండగా ఉంటామని పలువురు భరోసా ఇచ్చారు. అదేవిధంగా అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ క్రియాశీలక సభ్యత్వం ద్వారా ఇన్సూరెన్స్ పథకం వర్తించే విధంగా పలు అంశాల మీద సర్పంచ్ సంగీత సుభాష్ అధ్యక్షతన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కొరకు మీటింగులో వివరించడం జరిగినది. ఈ కార్యక్రమమునకు గ్రామంలో నలుమూలల నుంచి పలువురు పెద్దలు, నాయకులు కార్యకర్తలు యువకులు హాజరై, క్రియాశీల సభ్యత్వాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకుంటామని, జనసేనానికి, ప్రతి ఒక్కరూ పినపళ్ళ గ్రామం నుంచి అండగా ఉంటామని, ఇది ఒక మంచి కార్యక్రమం అని, మా కుటుంబాలకు చాలా భరోసాగా ఉంటుందని, ఈ కార్యక్రమం ప్రవేశపెట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ నాయకత్వానికి ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలుపుతూ, కార్యకర్తల కోసం, రాష్ట్ర ప్రజల కోసం ప్రతిక్షణం ఆలోచించే మంచి మనసున్న నాయకుడు, నీతిమంతుడు, ఒకే ఒక్కడు జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రమేనని, దేశ చరిత్రలో కార్యకర్తల కోసం ఆలోచించే నాయకుడు, మరేక్కడ ఇలాంటి నాయకుడు లేడని,అధికారం లేకపోయినా, కార్యకర్తలు బాగుండాలని, ఇలాంటి మంచి పథకం కార్యకర్తల భవిష్యత్తుకు వారి కుటుంబాలకు ఒక భద్రతను ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ అని, పలువురు జనసేనాని నాయకత్వం వర్ధిల్లాలని, తెలుగు ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుండే గొప్ప వ్యక్తి ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమేనని, వీరి మానవతా విలువలు, సేవలు ఎంతో గొప్పవని, ఈ రాష్ట్రానికి దశ దిశ చూపించగలిగే ఏకైక వ్యక్తి, ఒక శక్తి! ఒక జనసేనాని మాత్రమేనని, వారి నాయకత్వంలో మేము అంతా ఏకతాటిపై కలిసి ఐకమత్యంతో పనిచేస్తామని పలువురు ముక్తకంఠంతో పవన్ కళ్యాణ్ జిందాబాద్ అని జేజేలు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి, పినపళ్ల సర్పంచ్ సంగీత సుభాష్, పినపళ్ళ ఎంపీటీసీ పెద్దిరెడ్డి పట్టాభిరామన్న, పినపళ్ల జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు నామాల సుబ్బారావు, గ్రామపంచాయతీ వైస్ ప్రెసిడెంట్ యనమదల శీను, జనసైనికులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో వార్డ్ నెంబర్లు పాల్గొన్నారు.