రండి.. మీ సమస్యల పరిష్కారానికై జనసేనాని సిద్ధంగా ఉన్నారు: బండారు శ్రీనివాస్

అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజక వర్గంలో, నాలుగు మండలాల్లో ఉన్న కష్టాల్లో పలు సమస్యలు పై ఉన్నవారికి, ప్రజలకు, జనసైనికులకు తెలియజేయునది ఏమనగా కష్టాలతో పలు ప్రజా సమస్యలతో పరిష్కారం దొరకక, బాధపడుతున్నట్లు ఎవరైనా ఉంటే, ఆ సమస్యలను పరిష్కారం చూపించే గొప్ప నాయకుడుగా జనసేనాని మీకోసం సిద్ధంగా ఉన్నారని, ఈనెల జూలై 10 వ తారీకు ఆదివారం విజయవాడ మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియం నందు బెంజ్ సర్కిల్ దగ్గరలో ఈ జనవాణి కార్యక్రమం జరుగుచున్నది. ఎవరైనా ఆ పలు ప్రజా సమస్యలపై అర్జీలను జనసేనానికి స్వయంగా అందించగలరని కోరుచున్నామని కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కష్టాల్లో ఉన్న వారి కోసం ఒక మంచి కార్యక్రమాన్ని జనసేనాని ప్రవేశపెట్టడం పలు ప్రజల సమస్యల కొరకు అధికారం లేకపోయినా, మీ వెనుక కొండంత అండగా నేనున్నానని భరోసానివ్వడం, ఎంతో హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్, జనసేనాని సేవలను.. వారు ప్రజల పట్ల చూపుతున్న మానవత్వానికి, అంకితభావానికి కొనియాడారు.