జనసైనికుని కుటుంబానికి 5లక్షల చెక్కు అందజేసిన జనసేనాని

పెడన నియోజకవర్గం: బంటుమిల్లి మండలం, పెందుర్రు గ్రామానికి చెందిన జనసైనికుడు
కీ.శే పత్తి నాగ వెంకట రమణ (నాని) 2022 డిసెంబర్ 31న యాక్సిడెంట్ లో మరణించడం జరిగింది. జనసేన క్రియాశీలక సభ్యత్వం కలిగిఉన్న కార్యకర్త పత్తి నాగ వెంకట రమణ కుటుంబానికి మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును అందించారు. జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే ప్రతీ కార్యకర్త కుటుంబానికి అండగా నిలుస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి జనసేన శ్రేణుల తరపున పెడన నియోజకవర్గ జనసేన యడ్లపల్లి రామ్ సుధీర్ తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.