లండన్ లో అంబరాన్నంటిన జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

లండన్, జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎన్నారై జనసేన యూకె టీం లండన్ మహా నగరంలో శంకర్ సిద్ధం మరియు చందు సిద్ధం బ్రదర్స్ వారి అద్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగింది. ఈ సభకి యూకె నలుమూలల నుండి ఎంతో ఉత్సహాహంతో జనసైనికులు మరియు వీర మహిళలు హాజరవడం జరిగింది. కేక్ కట్ చేసి ఆవిర్భావ సభ వేడుకలకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీడియో సందేశాలను ప్రదర్శించి ఆహ్లాదభరిత వాతావరణంలో వేడుకలను నిర్వహించారు. 2024 ఎన్నికలలో జనసేన పార్టీని గెలిపించే విధంగా ఒక యుద్ధ ప్రాతిపదికన మనమందరం కృషి చెయ్యాలి అని తెలియ చెయ్యటం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు నాగబాబు కొణిదల వీడియో కాల్ లో వారి సందేశాన్ని టీంకి తెలిపారు. మరియు జూమ్ కాల్స్ లో విజయవాడ నగర జనసేన పార్టీ అద్యక్షులు పోతిన వెంకట మహేష్, జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ సందీప్ పంచకర్ల, జనసేన పార్టీ లీగల్ సెల్ శాంతి ప్రసాద్ సింగలూయు మరియూ పసుపులేటి ఉష కిరణ్ తో జూమ్ కాల్స్ లో ఇంటరాక్ట్ అయ్యి మన జనసేన పార్టీని ఇంకా ముందుకి ఎలా తీసుకువెళ్ళాలి అనే స్ఫూర్తిని పొందటం మరియు జనసైనికులు మరియు వీర మహిళలు వారి వారి సలహాలు, ప్రశ్నల రూపంలో లీడర్స్ కి సూచనలు ఇవ్వటం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలు బాగున్నాయి మన రాజకీయాలలో మార్పు రావాలి అంటే ఈ పార్టీ ద్వారానే సాధ్యం కావున యూకె జనసేన టీం నుంచి ఇప్పటి వరకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా అనేక కార్యక్రమాల ద్వారా 20 లక్షల పైచిలుకుగా ఫండ్ కలెక్ట్ చేసి ఇవ్వటం జరిగింది, అంతటితో ఆగకుండా ఇంకా జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 10 లక్షల రూపాయలు పైగా విరాళం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలపటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నాయకులతో కమ్యూనికేట్ చెయ్యటానికి సహకరించిన నాగ నామన, సురేష్ వరికూటి, నాగరాజు వడ్రాణంలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించటానికి కృషి చేసిన నాగరాజు వడ్రాణం, అయ్యప్ప గార్లపాటి, పద్మజ రామిశెట్టి, అశోక్ మాజేటి ఫ్రెండ్స్, కళ్యాణ్ వడ్డీ, కమల్ మానుకొండ, అమల చలమలశెట్టి, శ్రీనివాసు పల్లి మరియు శివ మేక, వేదం వాసు గమిది, గౌతమ్ కుమార్ సహాయ సహకారాలు చెప్పలేనివి. మేము అందరం సపోర్ట్ ఉన్నాము అంటూ ఈ ఈవెంట్ కి అటెండ్ అయిన జనసైనికులకు మరియు వీర మహిళలకు యూకె జనసేన టీం కృతజ్ఞతలు తెలియచెయ్యటం జరిగింది.