స్పూర్తి వెల్ఫేర్ ఆశ్రమంలో జనసేనాని జన్మదిన వేడుకలు

విశాఖపట్నం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు శనివారం రేపాక నాగేశ్వరరావు స్పూర్తి వెల్ఫేర్ ఆశ్రమంలో జనసేనాని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రేపాక నాగేశ్వరరావు (బ్రహ్మస్త్రం నాగు) తన బ్రహ్మస్త్రం కిట్లను సుమారుగా 50 మంది అనాధ బిడ్డలకు ఇలా అందించడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు గాజువాక నియోజకవర్గంలో శ్రీశ్రీశ్రీ కుంచుమాంబ అమ్మవారి గుడిలో ఘనంగా నిర్వహించడం జరిగింది. గోత్ర నామంతో పవన్ కళ్యాణ్ పేరు మీద పూజ చేయించడం జరిగింది. ఇంకా మహిళలు ఎక్కువుగా ఉన్న ఇంకో అనాధ ఆశ్రమంలో మన జనసేన పార్టీ సిద్ధాంతాలు గురించి చెప్పడం ఇంకా సుమారుగా నా జనసేన పుస్తకాలు అవగాహన ఉన్నవారికి ఇవ్వడం కూడా జరిగిందని తెలిపారు. ఇంకా ఇలా అనేక సేవా కార్యక్రమాలుతో పాటుగా మరికొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని రక్తదాన కార్యక్రమాలు నిర్వహించడం కూడా జరిగిందని తెలిపారు.