తాడిగడపలో జనసేనాని జన్మదిన వేడుకలు

కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని తాడిగడప మున్సిపల్ ఏరియా లోజనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని పోరంకి గ్రామంలోని అనాధ ఆశ్రమంలో అల్పాహారం పళ్ళు పంపిణీ కార్యక్రమం జరిగింది. మురళి నగర్ వణుకురు, గోసాల, కంకిపాడు, ఈడుపుగల్లు, ఏరియాల్లో రక్తదాన శిబిరం, కేక్ కటింగ్, కానూరు గ్రామంలో వివిధ ప్రాంతాల్లో కేక్ కటింగ్ లుయువకులు బైక్ ర్యాలీలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి పండమనేని శ్రీనివాస్, కృష్ణాజిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు గరికిపాటి ప్రసాద్, నియోజకవర్గ నాయకులు బొల్లం వీరన్ కుమార్, తాడిగడప మున్సిపల్ ఉపాధ్యక్షులు వడ్డీ జీవా, తాడిగడప మున్సిపల్ ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి సుదీర్, వన్నెంరెడ్డి కృష్ణారావ్, పెనమలూరు మండల ఉపాధ్యక్షులు చెన్నా గాంధీ, మున్సిపల్ సంయుక్త కార్యదర్శి గమిడి రాజు తదితరులు పాల్గొని ఈ వేడుకలు జయప్రదం చేయడం జరిగింది.