అమరావతిలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల భాగంగా శనివారం అమరావతిలోని మిట్ట మీదుగా కేక్ కటింగ్ మరియు అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులురాయి సత్యనారాయణ జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. మండల ప్రధాన కార్యదర్శి కోలా శ్రీను, అమరావతి మండల కార్యదర్శి చల్లా కోటేశ్వరరావు, అమరావతి మండల కార్యదర్శి రోహిత్ బాబు, డేగలనాగేశ్వరరావు, పండు, నాయుడు, షేక్ నాగుల్, ఎత్తి భవిరిశెట్టి వెంకటేశ్వరావు, కోల వెంకటేశ్వరావు పాల్గొన్నారు.