బనగానపల్లెలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

బనగానపల్లె, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బనగానపల్లె నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు భాస్కర్ అన్నారు. అందులో భాగంగానే శనివారం భాస్కర్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని హైస్కూల్ గ్రౌండ్ నందు రక్తదాన శిబిరం, హుసేనాపురం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు మరియు వారి స్కూలు ఐడెంటి కార్డులు అలాగే పట్టణంలోని ప్రియదర్శిని వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రక్త కొరత ఏర్పడిందని అందువలన రక్తదానం కార్యక్రమం ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని జనసైనికులతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, అన్ని మండలాల నుండి జనసైనికులు భారీగా తరలివచ్చి రక్తదానం చేయడం జరిగిందని, హుసేనాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఐడెంటిటి కార్డులు లేని విషయం తెలుసుకొని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వారికి ఐడెంటిటి కార్డులు తయారు చేయించి ఇవ్వడం జరిగిందని, అలాగే బనగానపల్లె పట్టణంలోని ప్రియదర్శిని వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేయడం జరిగిందని ఎన్నో ఏళ్లుగా తమ అభిమాన నాయకుడు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా స్థానికంగా ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ జిల్లా సభ్యులు చినబాబు మాట్లాడుతూ తమ పార్టీ అధినేత పుట్టినరోజు వేడుకలను ప్రతి సంవత్సరం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ప్రజాసేవతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటామని అలాగే నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామని త్వరలోనే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర రాయలసీమలో మొదలుపెట్టబోతున్నాడని యాత్ర విజయవంతం చేసే దిశగా జనసైనికులు అందరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బనగానపల్లె మండలం నాయకుడు మహబూబ్ బాషా కొలిమిగుండ్ల మండల నాయకులకు పృథ్వి అవుకు మండల నాయకులు అజిత్ రెడ్డి సంజామల మండల నాయకులు రాజు కుల్లాయి జనసైనికులు సురేంద్ర కృష్ణ బాబు ప్రశాంత్ కిరణ్ కుమార్ రెడ్డి షేక్షావలి ఇద్దరూష్ భాష శివ ఓబులేసు నాగార్జున రామకృష్ణ రాజు తదితరులు పాల్గొన్నారు.