పేరూరులో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

రామగిరి మండలం, పేరూరు గ్రామములో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా శనివారం రాప్తాడు ఇన్ ఛార్జ్ సాకే పవన్ కుమార్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలలో భాగంగా బైక్ ర్యాలీ, మెయిన్ బస్టాండ్ లో కేక్ కటింగ్ మరియు క్రియాశీలక కిట్ల డిస్ట్రిబ్యూషన్, అన్నదానము నిర్వహించారు. ఈ కార్యక్రమములో ముఖ్య అతిథిగా రాప్తాడు ఇన్ ఛార్జ్ సాకే పవన్ కుమార్, రామగిరి మండల అధ్యక్షుడు డి పి నారాయణ, చెన్నేకొత్తపల్లి మండల ప్రధాన కార్యదర్శి బసంపల్లి నారాయణ స్వామి, చిత్ర రమేష్, పి. నారాయణ, రాయల్ మురళి, ఎం శ్రీనివాసులు, జనసేన కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.