సర్వేపల్లి గ్రామంలో జనసేనాని జన్మదిన వేడుకలు

సర్వేపల్లి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా శుక్రవారం వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి గ్రామంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో భారీ కేక్ ఏర్పాటు చేసి కట్ చేశారు. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల అవినీతి అక్రమాలకు అదుపు లేకుండా పోయింది. మూడున్నర ఏళ్ల పాలనలో వైసిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం. వైసీపీ నాయకులు పంచాయతీ నిధులను భారీగా దుర్వినియోగం చేస్తున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం లోపించిన పంచాయతీ పాలకులు పట్టించుకోవడం లేదు. పంచాయతీ పాలకులకు పంచాయతీ నిధులను తినడానికి సమయం సరిపోతుంది. అభివృద్ధి చేయడం చేతకాక తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పై వైసిపి నాయకులు అర్థరహిత విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. కౌలు రైతులు చనిపోతుంటే వైసీపీ ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలు వారిని ఆదుకోవాల్సింది పోయి తమ నాయకుడిని విమర్శిస్తున్నారు. తమ నాయకుడు ప్రతి కౌలు కుటుంబానికి రూ.లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని తమ నాయకుడే చేస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరుతున్నట్లుగా ఉంది. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి తమ నాయకుడు పవన్ కళ్యాణ్ అని, జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అవినీతి లేని పరిపాలన కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీహరి, సందీప్, రహీమ్, గణపతి, కాకి శివకుమార్, రవికుమార్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.