చల్లా శివారెడ్డి ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి చల్లా శివారెడ్డి స్వగ్రామం అయిన ఎలబోతారంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పేరు మీద విఘ్నాలను తొలగించే ఆది దేవుడు గణేశునికి ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం కేక్ కట్ చేసి, ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదనంతరం శివా రెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ తలపెట్టిన “నా సేన కోసం నా వంతు” వంటి క్రౌడ్ ఫండింగ్ కార్యక్రమం వాటి గురించి క్రియాశీల సభ్యులకు తెలియజేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క క్రియా శీలక కార్యకర్త ఇట్టి కార్యక్రమంలో పాల్గొని “నా సేన కోసం నా వంతు” కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.