రొబ్బా మహేష్ ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు

జనసేన పార్టీ అధ్యకులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మాడుగుల జనసైనికులు రొబ్బా మహేష్ ఆధ్వర్యంలో మాడుగుల పట్టణ జనసైనుకులందరు కలిసి పలుసేవా కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగా మాడుగుల బస్ స్టాండ్ ఆవరణలో కేక్ కటింగ్, పేదలకు చీరలు పంపిణీ, వృద్ధాశ్రమంలో వృద్ధులకు చీరలు, పండ్లు, రొట్టెలు పంపిణీ, మాడుగుల గేడ్డబడి, గదబురులో చదువుతున్న పిల్లలకు పుస్తకాలు, పెన్నలు, పెన్సిల్ పంపిణీ, మాడుగుల 30 పడకల ప్రభుత్వ హాస్పటిల్ లో పేషెంట్ మంచాల దగ్గర కూర్చోడానికి వీలుగా 10 బెంచిలు, రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీతారాం, దాసరి అచ్చుతూ రావు, అప్పుల నాయుడు, వీర సురేఖ, దయ యాదవ్, ఇల్లపు రణేష్, గళ్ళ గణేష్, మంచాల శివ, రాక్కెట్టి నూకరాజు, లోకేష్, అప్పి, అచ్చుతరావు, కోళ్ల చిన్నా, సంతో నూకరాజుతో పాటు సుమారు 150 మంది జనసైనికులు పాల్గొన్నారు.