తునిలో అంగరంగ వైభవంగా జనసేనాని జన్మదిన వేడుకలు

తుని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2 వ తారీఖున జనసేవ సభ్యులు అంబటి ప్రసాద్, చోడిశెట్టి భాస్కర్, రాచపోతుల అశోక్, గోనెల వీరబాబు, వంగలపూడి వంశీ ఆధ్వర్యంలో జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి ముఖ్య అతిధిగా విచ్చేసి రాజా గ్రౌండ్ లో మెగా రక్తదాన శిభిరం ప్రారంభించారు. 120 యూనిట్స్ రక్తం సేకరించడం జరిగింది. రక్తదానం చేసిన వారికి 1,00,000/- ఇన్సూరెన్స్ కలిపించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్, జనసేనపార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి వంగలపూడి నాగేంద్ర, ఉమ్మడి తూర్పు గోదావరి సంయుక్త కార్యదర్శి పలివెల లోవరాజు, తొండంగి మండల అధ్యక్షులు నాయుడు, కోటనందూరు మండల అధ్యక్షులు పెదపాత్రుని శ్రీనివాస్, జనసేన నాయకులు సీతారామరాజు, జనసేన శివ, ఇండుగుపల్లి శ్రీనివాస్, బాలాజీ, అనూరు ఈశ్వరరావు, నాగబాబు, రాచపోతుల వీరబాబు, కొత్తూరు శివ, నాగ శేషు, ప్రగడ రమేష్, ప్రసన్న, తర్ర దొరబాబు, శివ, దుర్గ నాయుడు, మరివాడ పంతులు, దొర, సర్దార్, దుర్గ నాయుడు, రమేష్ గోపి, కీర్తి గోవిందు మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

  • అంకారెడ్డి రాజాశేషు ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు

తుని నియోజకవర్గం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు శనివారం తుని నియోజకవర్గంలో తుని నియోజకవర్గ జనసేన నాయకులు అంకారెడ్డి రాజా శేషు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. జనసేనాని జన్మదిన వేడుకలలో భాగంగా తుని నియోజకవర్గ జనసేన నాయకులు అంకారెడ్డి రాజా శేషు ఆధ్వర్యంలో అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్దాంతాలకు అనుగుణంగా తమ స్వహస్తాలతో చెత్తను, చెదారంను శుభ్రం చేస్తున్న పారిశుధ్య కార్మికులను గౌరవిస్తూ వాళ్ళతో అల్పాహార విందు నిర్వహించడం జరిగింది. అనంతరం వారికి దుస్తులు, సబ్బులు మరియు సానిటైజర్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.

  • ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమాలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కోటనందూరు మండలంలో అంకారెడ్డి రాజా శేషు మరియు కోటనందూరు మండల కమిటీ ఆధ్వర్యంలో కోటనందూరు గ్రామంలో పవన్ కళ్యాణ్ పేరున పూజలు నిర్వహించి అనంతరం వృద్దులకు అన్నదాన కార్యక్రమం, వారి సమక్షంలో కేకు కటింగ్ చేసి, మన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, వాళ్లు ఆశీర్వాదాలు తెలిపారు అనంతరం ఉచిత కంటి వైద్య శిబిరం, రక్త దాన శిబిరం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

  • బెండపూడిలో జనసేనాని జన్మదిన వేడుకలు

జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా బెండపూడి గ్రామంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. సుబ్బరాయపురంలో 12 గంటలకు సంయుక్త కార్యదర్శి సతీష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు ఉదయం 7 గంటలకు బెండపూడి సాయిబాబా గుడిలో పవన్ కళ్యాణ్ గోత్ర నామాలతో పూజలు నిర్వహించారు అనంతరం పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. 9 గంటలకు బెండపూడి హైస్కూల్ లో పిల్లలకు చాక్లెట్స్ పంచి పెట్టారు. మధ్యాహ్నం 11 గంటలకి తునిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రక్త దానం చేసి 12గంటలకి యాచకులకు, వృద్దులకు భోజనం అందచేయడం జరిగింది. సాయంత్రం స్థానిక కృష్ణలయం వద్ద కేక్ కట్ చేసి స్థానిక పెద్దలకు ప్రజలకు పంచుతూ అటాహాసంగా బాణసంచా కాలుస్తూ జనసైనికులు అందరూ తమ ఒకరోజు జీతం పార్టీ అకౌంట్ కి డొనేట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా ముగించారు.

  • 52 మంది చిన్న పిల్లల చేత 52 కేకులు కటింగ్

జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని తుని నియోజకవర్గం, తొండంగి మండలం, పైడికొండ గ్రామంలో పైడికొండ జనసేనపార్టీ ఆధ్వర్యంలో ముందుగా పవన్ కళ్యాణ్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి 52 మంది చిన్న పిల్లల చేత 52 కేకులు కట్ చెయ్యటం జరిగింది. కేకులు కటింగ్ చేసిన అనంతరం పిల్లలకు పెన్నలు పంపిణి చెయ్యటం జరిగింది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక అంటే యావత్ భారతదేశం ఒక పెద్ద పండగ. ఈ పండుగలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీ పలివెల లోవరాజు, తొండంగి మండల ప్రధాన కార్యదర్శి పైడికొండ ఎంపిటిసి అభ్యర్థి గట్టెం నాగబాబు, నరిశే నాగేశ్వరావు, నరిశే పోలరాజు, పొన్నగంటి బద్రి, బిరుసు ఈశ్వరరావు, శేఖర్, నూకరాజు, నరిశే పృద్వి, చిరంజీవి, కట్టా పండు, పలివెల శివకుమార్, పలివెల బద్రి, స్వామి, మొండి దుర్గ ప్రసాద్, పవన్, గ్రామ పెద్దలు వెంకటాద్రి మరియు పైడికొండ జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొని వియవంతం చెయ్యటం జరిగింది.