సత్యవేడు జనసేన ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు

సత్యవేడు నియోజకవర్గం, వరదయ్యపాలెం మండలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని మండల అధ్యక్షుడు చిరంజీవి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి, పేదలకు అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా కార్యదర్శులు కొప్పల లావణ్య కుమార్, హేమకుమార్ హాజరయ్యారు. లావణ్య కుమార్ మాట్లాడుతూ పేదలకోసం ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్ అని రాబోయేది జనసేన ప్రభుత్వం అని, రాబోయే ఎన్నికల్లో సత్యవేడు నియోజకవర్గములో జనసేన అభ్యర్థిని గెలిపించి పవన్ కళ్యాణ్ కి బహుమతిగా ఇవ్వాలని కార్యకర్తలకు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శేఖర్ తులసి రామ్ కమిటీ సభ్యులు శిరీష మహేష్ ప్రసాద్ వసంత్ తదితరులు పాల్గొన్నారు.