పత్తికొండలో అంగరంగ వైభవంగా జనసేనాని పుట్టినరోజు

పత్తికొండ, స్టేట్ బ్యాంక్ దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీగా బయలుదేరి గవర్నమెంట్ హాస్పిటల్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తదనంతరం హాస్పిటల్ లో ఉన్న పేషెంట్లకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. తదనంతరం స్టేట్ బ్యాంక్ దగ్గర జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కేక్ కటింగ్ చేశారు, తదనంతరం జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేశారు. నియోజకవర్గ నాయకుడు సిజి రాజశేఖర్ మాట్లాడుతూ 2024లో పవన్ కళ్యాణ్ ని సీఎం చేయడమే మా బాధ్యతని తెలియజేశారు పాలన మారాలి. పవన్ రావాలి అన్నారు పత్తికొండ నియోజకవర్గంలో జనసేన పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి 2024 లో పత్తికొండ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పత్తికొండ, మద్దికేర, తుగ్గిలి మండలాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్క నియోజకవర్గ నాయకులకు, మండల నాయకులకు, కార్యకర్తలకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.