అంభేడ్కర్ ఆశయసాధనకు జనసేన కృషి

జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: దళితజాతి పితామహుడు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంభేడ్కర్ ఆశయసాధనకు జనసేన పార్టీ కృషి చేస్తుందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు.అంభేడ్కర్ 133వ జయంతి సందర్భంగా ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ ఏప్రిల్ 14 అనేది క్యాలెండర్ లో ఒక తేదీ మాత్రమే కాదని, సామాజికన్యాయం, సమానత్వానికి అంకితమైన ఒక కారణజన్ముడుని స్మరించుకునే సందర్భమన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికై తన జీవితాంతం కృషి చేసిన మహనీయుడు అంభేడ్కర్ అంటూ ఆళ్ళ హరి కొనియాడారు.