కొండవీడులో మట్టి మాఫియాపై జనసేన పోరాటం

*అటవీ భూముల్లో అక్రమ తవ్వకాలను అడ్డుకున్న గాదె వెంకటేశ్వరరావు

చిలకలూరి పేట నియోజకవర్గం, కొండవీడు ప్రాంతములోని అటవీశాఖ భూములలో జరుగుతున్న అక్రమ మట్టి మైనింగ్ మాఫియాను అడ్డుకున్న జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు. గత కొన్నేళ్లుగా జరుగుతున్న మట్టి మాఫియాను అరికట్టాలని స్థానిక గ్రామాల ప్రజలు నియోజకవర్గం పార్టీ నాయకులతో కలసి జిల్లా కార్యాలయానికి ఫిర్యాదు చేయడముతో శనివారం పార్టీ నాయకులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అటవీ, ప్రభుత్వ భూముల్లో 6 జేసీబీ లు, 15 టిప్పర్ లారీలతో మట్టి మాఫియాను చూసి నివ్వెర పోవడం జరిగింది. చారిత్రక ప్రాంతమైన కొండవీడులో కూటమి ప్రభుత్వ పరిపాలనలో పట్టపగలే అక్రమ మట్టి త్రవ్వటాన్ని జనసేనపార్టీ ఖండిస్తుందని గాదె వెంకటేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అవినీతి రహిత పాలన కోసం పాటుపడుతుంటే, దానికి విరుద్ధముగా ఇక్కడ అవినీతి మాఫియా రాజ్యమేలుతోంది. స్థానిక తహశీల్దార్ కి ఫిర్యాదు చేసిన ఇంతవరకు ఇక్కడకు రాలేదన్నారు. జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినా ఏ అధికారి ఇక్కడకు రాలేదు.. అస్సలు ఈ ప్రాంతములో ఏమి జరుగుతుందని అర్ధం కావట్లేదు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు.. కూటమి ప్రభుత్వములో అవినీతి జరుగుతుంటే దానిని అడ్డుకుంటామని, అడ్డుకోమని సూచించారు. జనసేనపార్టీ ప్రజల పక్షాన మాత్రమే నిలుచుంటుందని , మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన బాటలోనే నడుస్తామని తెలియజేశారు. స్థానికి ఎమ్మెల్యే గారు ప్రత్తిపాటి పుల్లారావు గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతామని అన్నారు. రాజధాని ప్రాంతములో చరిత్రాత్మక ప్రాంతమైన కొండవీడులో పట్టపగలే ఇంత మాఫియా జరుగుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తి నట్టు ప్రవర్తించడం పై ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. అక్కడ ఉన్న గురుకుల పాఠశాల, వసతి గృహం ఉందని, ఈ మైనింగ్ వలన వచ్చే కాలుష్యం తో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని వారు తెలుపుతున్నారు. ఈ ప్రాంతానికి వచ్చిన తరువాత జనసేన శ్రేణులను చూసి టిప్పర్లు డ్రైవర్లు, ప్రోక్ లైనర్ డ్రైవర్లు పారిపోయారు. వాటి తాళాలను స్థానిక వీఆర్వో కి అందచేయమని తాసిల్దార్ గారు తెలపడంతో తాళాలను మీడియా సమక్షంలో విఆర్ఓ కి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సమరయకర్త తోట రాజ రమేష్, జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ శిఖా బాలు, జిల్లా సంయుక్త కార్యదర్శి సుభాని, బంధాల జ్యోతి, మండల అధ్యక్షులు పఠాన్ ఖాదర్బాషా, మునీర్ హసన్, మండల ఉపాధ్యక్షులు మేకల రామారావు, దరదాసుల శరత్, మండల నాయకులు బాపన హనుమంతరావు, తోట నాని, వీరాంజనేయులు, కుంచలపల్లి సాంబశివరావు, గోశాల విజయ్,అనిత, ఏసుబాబు, ఆముదాల లీలా కిషోర్, కూరపాటి శివశంకర్, సాంబ స్థానిక గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-06-28-at-8.45.46-PM-1024x576 కొండవీడులో మట్టి మాఫియాపై జనసేన పోరాటం

Share this content:

Post Comment