*పెన్నా నది కాలుష్యంపై మునిసిపల్ కమిషనర్‌కు జనసేన వినతి
నెల్లూరు నగరంలో పెన్నా నది కాలుష్యంపై తీవ్రంగా స్పందించిన జనసేన పార్టీ సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్, డ్రైనేజి వ్యర్థాలు నదిలో చేరుతున్న ఘటనపై ఈరోజు మునిసిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. పెన్నానది పరివాహక ప్రాంతాల్లో మురుగు నీరు, చెత్త నేరుగా నదిలో కలుస్తుండటంతో ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే చర్యలు తీసుకుని కాలుష్యాన్ని నియంత్రించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్, గుర్రం కిషోర్, సుల్తాన్, వర్షాచలం రాజేష్, ప్రశాంత్ గౌడ్ తదితర జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.
జనసేన ప్రజా సమస్యలపై ఉద్యమ పంథాలో ముందంజలో ఉన్నదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Share this content:
Post Comment