*జనసేనలో 80 కుటుంబాలు చేరిక
విజయనగరం: ప్రజాసంక్షేమం, పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యమని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. కోరుకొండ పాలెం గ్రామం నుండి కుప్ప రాంబాబు నేతృత్వంలో 80 కుటుంబాలకు చెందిన వాళ్ళు జనసేన నేత గురాన అయ్యలు ఆధ్వర్యంలో శుక్రవారం వైకాపా నుండి జనసేన పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా అయ్యలు మాట్లాడుతూ.. ప్రజా ప్రయోజనాల పట్ల నిబద్ధత, నిజాయితీ, ప్రజాస్వామ్యంపై గౌరవం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో చాలా అరుదన్నారు.ఆయన నాయకత్వంలో పనిచేయడం అదృష్టమన్నారు. కూటమి ప్రభుత్వ పాలన చాలా బాగుందన్నారు. అనుభవజ్ఞుడైన సీఎం చంద్రబాబు విజన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నూతన ఆలోచనలతో ప్రజలు కోరికలు అనుగుణంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. గత ఐదేళ్లలో ఎన్నో దారుణాలు చూసిన ప్రజలు… నేడు కూటమి ప్రభుత్వం పాలనలో స్వేచ్ఛగా తమ సమస్యలను చెప్పుకుని పరిష్కరించుకోగలుగుతున్నారని అన్నారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్ధికి బాటలు పడ్డాయని వెల్లడించారు. ఎన్నడూ లేని విధంగా పంచాయతీరాజ్ శాఖ పని చేస్తోందని, అంతే కాకుండా రాష్ట్రంలో అవినీతి లేకుండా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. రూపాయి లంచం లేకుండా, సిఫార్సులు లేకుండా బదిలీలు జరిగాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలు, వీరమహిళలు పాల్గొన్నారు.

Share this content:
Post Comment