శ్రీ మాతా పరమేశ్వరి జాతరలో జనసేన సేవా హస్తం

ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం మండలం, మర్రిపాడు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ మాతా పరమేశ్వరి దేవస్థానం జాతర మహోత్సవానికి ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్ & నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఇన్‌చార్జ్ వేములపాటి అజయ్ కుమార్ సూచనలతో, ఆత్మకూర్ నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు చదలవాడ హరీష్ కుమార్ గారు జనసేన పార్టీ తరఫున రూ.5,116/- విరాళంగా అందజేశారు. ఈ పుణ్యకార్యక్రమంలో చిరంజీవి యువత అధ్యక్షులు & సంగం మండల జనసేన సీనియర్ నాయకులు దాడి భాను కిరణ్, మండల ఉపాధ్యక్షులు చల్లా రవిచంద్ర మరియు మర్రిపాడు దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జనసేన పార్టీ సంప్రదాయాలను గౌరవిస్తూ, సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూ, ప్రజలతోపాటు మతపరమైన వేడుకల్లోనూ తమ సేవను కొనసాగిస్తోంది.

Share this content:

Post Comment