పేద కుటుంబాలకు జనసేన చేయూత..!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ స్ఫూర్తి తో, ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ఆశీస్సులతో జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం సీనియర్ నాయకులు మరియు నియోజకవర్గ ఐటీ కో-ఆర్డినేటర్ పులిపాటి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో, ఆత్మకూరు రూరల్ నాయకులు వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో, ఆత్మకూరు రూరల్ మండలం మురగళ్ళ గ్రామంలో నిరుపేద ఒంటరి మహిళకి కష్ట కాలంలో భరోసా ఇస్తూ నెలకి సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ జనసేన పార్టీ తరఫున అందచేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజవర్గ ఉపాధ్యక్షులు దాడి బాను కిరణ్, ఏఎస్ పేట మండల అధ్యక్షులు సయ్యద్ అక్బర్ బాషా, చేజర్ల మండల జనసేన పార్టీ సీనియర్ నాయకులు గొల్లపల్లి ప్రసాద్, కనకం హరీష్, జనసేన పార్టీ ఆత్మకూరు టౌన్ సీనియర్ నాయకులు గడ్డం వంశీకృష్ణ, ఏఎస్ పేట జనసేన పార్టీ సీనియర్ నాయకులు భానుచంద్ర, హరి, చేజర్ల మండల చిరంజీవి యువత అధ్యక్షులు శ్రీను, ఆత్మకూరు రూరల్ జనసేన పార్టీ నాయకులు రాజేష్, చేజర్ల మండల జనసేన పార్టీ నాయకులు మస్తాన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment