జనక్షేమమే జనసేన ధ్యేయం

తెలంగాణ, వనపర్తి, జనసేన పార్టీ వనపర్తి జిల్లా కోఆర్డినేటర్ ముకుంద నాయుడు ఆదేశాల మేరకు గోపాల్ పేట్ మండలంm జయన్న తిరుమలాపురం గ్రామంలో శనివారం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు వడ్డెమాన్ సాయిబాబా మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న సభ్యులకు కిట్లు అందజేస్తూ క్రియాశీలక సభ్యత్వం యొక్క ఆవశ్యకతను వివరించడం జరిగింది. జనసేన పార్టీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ దానికి గ్రామస్థాయి నుంచి మన వంతు బలోపేతం చేసే కార్యక్రమాల్లో ముందుండాలని, కళ్యాణ్ ఆశయాలను జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని, జనసేన పార్టీని బూత్ స్థాయిలో బలంగా నిర్మింపజేయాలని జనసేన కార్యకర్తలకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు వడ్డెమాన్ సాయిబాబా ఉపాధ్యక్షులు విష్ణు, రమేష్, కుర్మయ్య, వెంకటయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.